సుప్రీంకోర్టులో జూనియర్‌‌ కోర్ట్‌‌ అసిస్టెంట్స్​

సుప్రీంకోర్టులో జూనియర్‌‌ కోర్ట్‌‌ అసిస్టెంట్స్​

భారత అత్యున్నత న్యాయస్థానం 210 జూనియర్‌‌ కోర్టు అసిస్టెంట్‌‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. బ్యాచిలర్‌‌ డిగ్రీ, ఇంగ్లిష్‌‌ టైపింగ్​‌‌లో నైపుణ్యంతో పాటు కంప్యూటర్‌‌ ఆపరేషన్‌‌ నాలెడ్జ్​ ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆబ్జెక్టివ్‌‌ టైప్‌‌ రాత పరీక్ష, కంప్యూటర్‌‌లో టైపింగ్‌‌ స్పీడ్‌‌ టెస్ట్, డిస్క్రిప్టివ్‌‌ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా సెలెక్షన్స్​ ఉంటాయి. 

వయసు: జులై 1, 2022 నాటికి 18 నుంచి-30 సంవత్సరాలు ఉండాలి. జనరల్‌‌/ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ఎక్స్‌‌-సర్వీస్స్​మెన్​ రిజర్వేషన్‌‌ ఉన్న అభ్యర్థులకు రూ.250 అప్లికేషన్ ఫీజు, ఆన్​లైన్​లో  జులై 10 వరకు చెల్లించాలి. 

ఎగ్జామ్​ ప్యాటర్న్​: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌‌ తరహాలో 100 ప్రశ్నలకు (50 జనరల్‌‌ ఇంగ్లిష్‌‌ ప్రశ్నలు, 25 జనరల్‌‌ ఆప్టిట్యూడ్, 25 జనరల్‌‌ నాలెడ్జ్‌‌ ప్రశ్నలు) ఉంటుంది.  ఈ పరీక్ష వ్యవధి 2 గంటలు. 1/4వ వంతు నెగెటివ్‌‌ మార్కింగ్‌‌ ఉంటుంది. 
2) ఆబ్జెక్టివ్‌‌ టైప్‌‌ కంప్యూటర్‌‌ నాలెడ్జ్‌‌ టెస్ట్‌‌ (25 ప్రశ్నలు) ఉంటుంది. 
3) టైపింగ్‌‌ టెస్ట్‌‌ (కంప్యూటర్‌‌ మీద) ఉంటుంది. నిమిషానికి 35 పదాల చొప్పున టైప్‌‌ చేయాలి. ఈ పరీక్ష సమయం 10 నిమిషాలు. 
4) డిస్క్రిప్టివ్‌‌ టెస్ట్‌‌ (ఇంగ్లిష్‌‌ లాంగ్వేజ్‌‌) - కాంప్రహెన్షన్‌‌ పాసేజ్, ప్రెస్సీ రైటింగ్, ఎస్సే రైటింగ్‌‌ ఉంటాయి. ఈ పరీక్షకు 2 గంటల సమయం ఉంటుంది. ఆబ్జెక్టివ్‌‌ పరీక్ష నిర్వహించిన రోజే టైపింగ్‌‌ టెస్ట్‌‌ ఉంటుంది. రాత పరీక్ష, కంప్యూటర్‌‌ నాలెడ్జ్‌‌ పరీక్ష, టైపింగ్‌‌ స్పీడ్‌‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను సెలెక్షన్​  చేస్తారు . 

వెబ్​‌‌సైట్‌‌: www.sci.gov.in