
సూర్య హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘కంగువా’. ‘శౌర్యం’ ఫేమ్ శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడికల్ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. సూర్య బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ ఇంప్రెస్ చేసింది. ఇప్పటికే కొడైకెనాల్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన టీమ్..గత కొంతకాలంగా రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నారు.
తాజాగా ఈ షెడ్యూల్ కూడా పూర్తయింది. సూర్య, బాబి డియోల్ కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలు, కొన్ని యాక్షన్ సీక్వెన్సులు చిత్రీకరించినట్టు తెలుస్తోంది. త్వరలో చెన్నై, బ్యాంకాక్‌లలో నెక్స్ట్ షెడ్యూల్స్ షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సూర్య కెరీర్‌లో 42వ చిత్రమిది. దిశా పటాని హీరోయిన్‌గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది పది భాషల్లో త్రీడీలో విడుదల చేయనున్నారు.