
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కృష్ణం రాజుపై సూర్యాపేట రూరల్ పోలీసు స్టేషన్లో ‘పోక్సో కేసు’ నమోదైంది. ఈ కానిస్టేబుల్ కృష్ణంరాజు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లిళ్లు చేసుకున్న విషయం బయటకు చెపితే చంపేస్తానంటూ బాధితులను బెదిరించాడు. నాలుగోవ భార్యగా పదవ తరగతి చదువుతున్న బాలికను కానిస్టేబుల్ కృష్ణంరాజు పెళ్లి చేసుకున్నాడు. వారం రోజుల క్రితం కానిస్టేబుల్ కృష్ణంరాజును జిల్లా ఎస్పీ నరసింహ సస్పెండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా పరిధిలో ఇటీవల కొందరు ఖాకీల తీరు వివాదాస్పదంగా మారింది. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన వృత్తిలో కొనసాగుతూ కొందరు ఖాకీలు దిగజారి ప్రవర్తిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా నూతనకల్ పాత ఎస్ఐ ప్రవీణ్ కుమార్పై ఇటీవల మరోసారి వేటు పడిన సంగతి తెలిసిందే. ఓ మహిళా కానిస్టేబుల్ను వేధిస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ అనంతరం రేంజ్ ఆఫీసుకు ఐజీ అటాచ్ చేశారు.
సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో స్పెషల్ టీంతో ఎంక్వయిరీ చేయించారు. మహిళా కానిస్టేబుల్పై ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధింపులు నిజమే అని తేలడంతో పోలీస్ శాఖ చర్యలు తీసుకుంది. ఎస్సైని సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మహిళలపై అగౌరవంగా ప్రవర్తిస్తే ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలోనూ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ పై అనేక ఆరోపణలు, సస్పెన్షన్ లు ఉన్నాయి. అయినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఎస్ఐ విచారణ జరిపిన ఉన్నతాధికారులు మరోసారి వేటు పడింది.