సుష్మ నాకు అమ్మలాంటిది.. పాక్ నుంచి విడిపించింది : హమీద్ అన్సారీ

సుష్మ నాకు అమ్మలాంటిది.. పాక్ నుంచి విడిపించింది : హమీద్ అన్సారీ

దివంగత బీజేపీ అగ్ర నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ తనకు అమ్మలాంటివారని చెప్పారు ముంబైకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హమీద్ నేహాల్ అన్సారీ. సుష్మా స్వరాజ్ తనకు పునర్జన్మ ఇచ్చారని… ఆమె అంటే తనకెంతో గౌరవం ఉందని చెప్పారు. తన హృదయంలో ఆమె ఎప్పటికీ బతికే ఉంటారని అన్నారాయన. పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చాక… తన భవిష్యత్తుకు సరైన సూచనలు చేశారనీ.. ఆమె మరణం తనకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పారు హమీద్ నేహాల్ అన్సారీ.

ఆప్ఘానిస్థాన్ నుంచి పాకిస్థాన్ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించారన్న సమాచారంతో 2012లో హమీద్ నేహాల్ అన్సారీని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన స్నేహితురాలిని కలిసేందుకు ఆయన పాకిస్థాన్ కు వెళ్లారు. తన కొడుకు కనిపించకుండా పోవడంతో… హమీద్ తల్లి ఫౌజియా.. కోర్టులో.. హెబియస్ కార్పస్ పిటిషన్ ను దాఖలుచేశారు. అక్రమంగా వచ్చారన్న కేసులో.. హమీద్ … మిలటరీ అదుపులో ఉన్నాడని ఓ కోర్టు తెలిపింది. 2015 డిసెంబర్ 15న హమీద్ కు పాక్ మిలటరీ కోర్టు శిక్ష విధించింది. బంధీ అయినప్పటినుంచి.. పెషావర్ సెంట్రల్ జైల్ లో ఆరేళ్లపాటు శిక్ష అనుభవించాడు హమీద్ అన్సారీ. భారత విదేశాంగ .. పాకిస్థాన్ పై ఒత్తిడి తేవడంతో.. 2018 డిసెంబర్ 19న విడుదలయ్యాడు. ఢిల్లీలో తనను కలిసిన హమీద్ అన్సారీని ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించారు సుష్మాస్వరాజ్. తనకు మరో జన్మ ప్రసాదించారంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు హమీద్ అన్సారీ.