మిస్ యూనివర్స్ విజయాన్ని త్రోబ్యాక్ చిత్రంతో పంచుకున్న సుస్మితా సేన్

మిస్ యూనివర్స్ విజయాన్ని త్రోబ్యాక్ చిత్రంతో పంచుకున్న సుస్మితా సేన్

సుస్మితా సేన్ 29 ఏళ్ల క్రితం దేశానికి మొట్టమొదటి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించారు. ఈ విజయం వార్షికోత్సవం సందర్భంగా, తాజాగా సుస్మితా సేన్ తన మనోహరమైన త్రోబాక్ చిత్రాన్ని పంచుకున్నారు. దాంతో పాటు ఆ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. ఈ ఫొటోను దివంగత ప్రబుద్ధ దాస్‌గుప్తా క్లిక్ చేశారని పేర్కొన్నారు.

“ఈ ఫొటోకు సరిగ్గా 29 సంవత్సరాలుయ. దీన్నిఎపిక్ మ్యాన్ & ఫోటోగ్రాఫర్ ప్రబుద్ధ దాస్‌ గుప్తా చిత్రీకరించారు. అతను చిరునవ్వుతో 18 ఏళ్ల నన్ను అందంగా బంధించాడు. నేను చిత్రీకరించిన మొదటి మిస్ యూనివర్స్ నువ్వేనని మీరు గ్రహించారు,  వాస్తవానికి ఇది భారతదేశపు మొట్టమొదటి మిస్ యూనివర్స్. నా మాతృభూమికి ప్రాతినిధ్యం వహించడం & గెలుపొందడం చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇది 29 సంవత్సరాల తరువాత కూడా ఈ చిత్రం నాకు ఆనందంతో కన్నీళ్లు తెప్పిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మే 21, 1994న మనీలా ఫిలిప్పీన్స్‌లో (మహల్ కితా) మిస్ యూనివర్స్‌ను గెలుచుకున్నందున నేను ఈ రోజును చాలా గర్వంగా జరుపుకుంటున్నాను, గుర్తుంచుకుంటాను. అంటూ సుస్మితా సేన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ ఫొటోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. సుస్మితా సేన్ కు కంగ్రాజ్యులేషన్స్ చెబుతూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ చిత్రంలో సుస్మిత.. తన రెండు చేతులను రెండు చెంపలకు ఆనించి ఓరగా చూస్తూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ గా మారింది.

https://www.instagram.com/p/CsfBgx1NMuY/?utm_source=ig_embed&ig_rid=59c8a920-6fc8-4fc8-9d4b-1910d6991f23