బిల్లులు రాక కూలీ పనులకు వెళ్తున్న మహిళా సర్పంచ్

బిల్లులు రాక కూలీ పనులకు వెళ్తున్న  మహిళా సర్పంచ్

మహబూబాబాద్ జిల్లా : రాష్ట్రంలో సర్పంచులకు పెండింగ్ బకాయిలు విడుదల కాకపోవడంతో అప్పులపాలయ్యారు. కొందరు సర్పంచులు కూలీ పనులకు కూడా వెళ్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ మహిళా సర్పంచ్ కూలీ పనులకు వెళ్తున్నారు. 

దంతాలపల్లి గ్రామ సర్పంచ్ సుస్మిత దినసరి కూలీగా మారారు. గ్రామాభివృద్ది కోసం దాదాపు రూ.20 లక్షల వరకు అప్పు చేశానని, పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు రాలేదన్నారు. బకాయిలు విడుదలకాకపోవడంతో అప్పులపాలై.. తప్పని పరిస్థితుల్లో కూలీ పనులకు వెళ్తున్నట్లు చెప్పారు. కుటుంబ పోషణ భారమవడంతో దినసరి కూలీ పనులు చేస్తున్నట్లు తెలిపారు.