మహారాష్ట్రలో అనుమానాస్పద బోటు కలకలం

మహారాష్ట్రలో అనుమానాస్పద బోటు కలకలం

మహారాష్ట్రలో ఓ బోటు కలకలం సృష్టించింది. రాయ్ఘడ్లోని హరిహరేశ్వర్ బీచ్ లో ఆయుధాలతో కూడిన బోటు లభ్యమైంది. భద్రతా బలగాలకు తనిఖీలు చేయగా.. అందులో ఏకే 47, బులెట్లతో పాటు పలు ఆయుధాలు, లైఫ్ జాకెట్ దొరికాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రాయ్ ఘడ్ ఎస్పీ అశోక్ పరిస్థితి సమీక్షించారు. ప్రవాహం ఉద్ధృతికి బోటు కొట్టుకొచ్చినట్లు పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లావ్యాప్తంగా భద్రత పెంచారు. ముంబయికి 190 కిలోమీటర్ల దూరంలో స్థానికులు బోటును గుర్తించి భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు పోలీసులు ప్రకటించారు. 

ఇదిలా ఉంటే పోలీసులకు లభ్యమైన బోటు ఆస్ట్రేలియా పౌరునిదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటించారు. బోటు ఇంజిన్ చెడిపోవడంతో సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఆయనను కొరియన్ బోటులోని వ్యక్తులు రక్షించినట్లు చెప్పారు. అలా సముద్రంలో ఆగిపోయిన బోటు ఇప్పుడు హరిహరేశ్వర బోచ్ కు కొట్టుకు వచ్చినట్లు ఫడ్నవీస్ చెప్పారు.