TFT డిస్ప్లేతో సుజుకీ యాక్సెస్ 125 లాంచ్..ధర, ఫీచర్లు ఇవే

TFT డిస్ప్లేతో సుజుకీ యాక్సెస్ 125 లాంచ్..ధర, ఫీచర్లు ఇవే

అత్యంత ప్రజాదరణ పొందిన  సుజుకీయాక్సెస్ 125 కొత్త రైడ్ కనెక్ట్ TFT ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది స్కూటర్ కొత్త టాప్-స్పెక్ మోడల్. దీని ఎక్స్ షోరూం ధర రూ.1లక్షా01వేయి900. LCD కన్సోల్‌తో కూడిన రైడ్ కనెక్ట్ వేరియంట్ కంటే రూ.6వేల800 ఎక్కువ ఖరీదైనది. 

కొత్త సుజుకీ యాక్సెస్ స్కూటర్ 125.. 4.2-అంగుళాల మల్టీ-ఫంక్షన్ కలర్ TFT స్క్రీన్‌తో వస్తుంది. దీనిని బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసే సౌకర్యం ఉంటుంది. ఈ స్క్రీన్ బ్రైట్ నెస్ విజువల్స్, ఫాస్ట్ రిఫ్రెష్ రేట్లు, అధిక కాంట్రాస్ట్ రేషియో ,పర్ఫెక్ట్ రంగులను అందిస్తుందని సుజుకి చెబుతోంది. ప్రకాశవంతమైన ఎండలో లేదా ఏదైనా పరిసర లైటింగ్ స్థితిలో మంచి స్పష్టతను అందించడానికి సుజుకి కొత్త పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్ కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. 

కొత్త సుజుకీ యాక్సెస్ స్కూటర్ 125..వివిధ రంగుల్లో లభిస్తోంది. మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్ ,సాలిడ్ ఐస్ గ్రీన్‌తో సహా ఇప్పటికే ఉన్న షేడ్స్‌తో పాటు కొనుగోలు చేయొచ్చు. 

ALSO READ | హైదరాబాద్‌‌‌‌ మార్కెట్‌‌లోకి కొత్త స్కోడా కోడియాక్‌‌‌‌

కొత్త వేరియంట్ సుజుకీ యాక్సెస్ 125 మిగతా అన్ని వేరియంట్ల మాదిరిగానే 125cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది ఇప్పుడు OBD-2B కంప్లైంట్‌గా ఉంది.8.3bhp ,10.2Nm పవర్ ఉత్పత్తి చేస్తుంది. 

పెట్రోల్ ట్యాంక్ విషయానికొస్తే.. ఇది 24.4-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ ,5.3-లీటర్ ఇంధన ట్యాంక్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. స్కూటర్, కెర్బ్ బరువు 106 కిలోలు. యాక్సెస్ 125 చాలా కాలంగా మార్కెట్లో అమితంగా ఇష్టపడే ఫ్యామిలీ స్కూటర్లలో ఒకటి. ఈ కొత్త వేరియంట్ అనేక మార్పులతో మరింత ఆకట్టుకుంటుంది.