
‘స్వాతిముత్యం’ లాంటి సాఫ్ట్ లవ్ స్టోరీ తర్వాత బెల్లంకొండ గణేష్ నటిస్తున్న రెండో సినిమా ‘నేను స్టూడెంట్ సర్’. బాలీవుడ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని హీరోయిన్. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ ఫేమ్ సతీష్ వర్మ నిర్మిస్తున్నారు. జూన్ 2న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆదివారం రిలీజ్ చేసిన ట్రైలర్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ఐ ఫోన్‌ను కొనుక్కోని దానిని సొంత తమ్ముడిలా చూసుకుంటాడు గణేష్. అయితే ఓ హత్య కేసులో పోలీసులకు అతనిపై బలమైన సాక్ష్యం లభించడంతో అదే ఫోన్ అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆసక్తిరేపేలా ట్రైలర్ కట్ చేశారు మేకర్స్. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది.