
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి(పీఎం ఎస్‌వీనిధి) స్కీమ్ కింద లోన్స్ తీసుకున్న 36 వేల మంది స్ట్రీట్‌వెండర్లను తమ ప్లాట్‌ఫామ్‌లో యాడ్ చేశామని ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ పేర్కొంది. స్ట్రీట్ వెండర్స్ ప్రోగ్రామ్‌ను 125 సిటీలకు విస్తరించామని కంపెనీ తెలిపింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్‌తో కలిసి అహ్మదాబాద్, వారణాసి, చెన్నై, ఢిల్లీ, ఇండోర్ సిటీలకు చెందిన 300 మంది స్ట్రీట్ వెండర్లను కంపెనీ ప్లాట్‌ఫామ్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద స్విగ్గీ యాడ్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో జాయిన్ అయ్యే ముందు ఈ 36 వేల మంది వెండర్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి. దీంతో పాటు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్‌ను కంపెనీకి సమర్పించాలి. కస్టమర్లు తమకు నచ్చిన స్ట్రీట్ వెండర్ నుంచి ఇక ఫుడ్ ఆర్డర్లు పెట్టుకోవచ్చని స్విగ్గీ సీఓఓ వివేక్ సుందర్ అన్నారు. ఇండియన్ ఫుడ్ కల్చర్‌లో స్ట్రీట్ వెండర్లు కీలకంగా ఉన్నారని చెప్పారు. వీరిని డిజిటల్ ఛానెల్ వైపు తీసుకు రావడంలో సాయం అందించిన మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్‌కు థ్యాంక్స్ చెప్పారు. సేఫ్, పాపులరయిన స్ట్రీట్ వెండర్లను గుర్తించేందుకు ఒక టీమ్ పనిచేస్తోందని స్విగ్గీ పేర్కొంది. కరోనా దెబ్బతో కస్టమర్లు రావడం తగ్గిందని ఓ స్ట్రీట్ వెండర్ చెప్పారు.