రంగురంగుల స్టిక్కర్స్​తో ఇంటికి డెకరేషన్​

రంగురంగుల స్టిక్కర్స్​తో ఇంటికి డెకరేషన్​

ఇంట్లో గోడలు, లివింగ్ రూమ్​, హాల్​లో మాత్రమే డెకరేషన్​ ఐటమ్స్ పెడతారు చాలామంది. కానీ  కాలింగ్ బెల్, ఛార్జింగ్ పాయింట్, టీవీ స్విచ్ వంటి వాటిని అలానే వదిలేస్తారు. రోజూ ఉపయోగించే వీటికి కూడా రంగురంగుల స్టిక్కర్స్​ అతికిస్తే ఇంటి డెకరేషన్​ కంప్లీట్ అవుతుంది. స్విచ్​ల మీద లేదా పక్కన రకరకాల పూల కొమ్మలు, జంతువులు, పక్షుల బొమ్మలున్న స్టిక్కర్స్​ అతికిస్తే స్విచ్​ బోర్డ్​లు కొత్తగా కనిపిస్తాయి. ముఖ్యంగా పిల్లల గదిలో ఎలక్ట్రిక్ బోర్డ్​ స్విచ్​లను ఇలా డెకరేట్​ చేస్తే వాళ్తు మస్త్​ ఖుషీ అవుతారు. వీటి ధర కూడా తక్కువే. సైజ్​, రకాన్ని బట్టి మార్కెట్​లో, ఆన్​లైన్​లో ఇవి రూ.85 నుంచి 150 రూపాయల వరకు దొరుకుతున్నాయి.