
హైదరాబాద్, వెలుగు: వాటర్ ట్యాంక్‌లను తయారు చేసే సింటెక్స్ 100 శాతం ఫుడ్ గ్రేడ్ వర్జిన్ ప్లాస్టిక్‌తో తయారైన ‘స్మార్ట్’ ట్యాంక్‌ను హైదరాబాద్‌లో లాంచ్ చేసింది. ఈ రకం ప్లాస్టిక్‌తో ఆరోగ్యానికి హాని ఉండదు. పూర్తిగా కొత్త (రీసైకిల్ కాని) ప్లాస్టిక్‌తో దీనిని తయారు చేస్తారు.
ప్రత్యేకంగా ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి, నీటిని భద్రపరచడానికి ఈ రకమైన ప్లాస్టిక్‌ను వాడతారు. సింటెక్స్ ‘సాఫ్, సేఫ్ , సహి’ నినాదంతో స్మార్ట్ ట్యాంక్‌ను తీసుకొచ్చింది. 500, 750, 1000 లీటర్ల సామర్థ్యంలో ఇవి అందుబాటులో ఉన్నాయి.