
- వివరాలు, అఫిడవిట్ సేకరించిన ఫీ రెగ్యులేటరీ కమిటీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలతో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) హియరింగ్ ప్రక్రియ పూర్తయింది. గత నెల 25న ప్రారంభమైన హియరింగ్ బుధవారంతో ముగిసింది. గతంలో కేవలం ఇంజినీరింగ్ కాలేజీల మేనేజ్‌మెంట్లు ఇచ్చే అకౌంట్స్ ఆధారంగానే రానున్న మూడేండ్ల కాలానికి టీఏఎఫ్‌ఆర్సీ ఆయా కాలేజీల్లో ఫీజులు నిర్ణయించే వారు.
కానీ, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం టీఏఎఫ్‌ఆర్సీ గైడ్ లైన్స్– 2006కు సవరణలు చేస్తూ, జీవో 33 ఇచ్చింది. దీని ప్రకారం అకౌంట్స్‌తో పాటు అకడమిక్ అంశాలనూ పరిగణనలోకి తీసుకొని, ప్రొఫెషనల్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో గతంలోనే పూర్తయిన హియరింగ్ ప్రక్రియ మరోసారి నిర్వహించింది. అనంతరం తుది నివేదికను సర్కారుతోపాటు కోర్టుకూ సడ్మిట్ చేయనున్నది.