నస్పూర్, వెలుగు: నస్పూర్ మండలంలోని లబ్ధిదారులకు సీసీసీ కార్నర్ నర్సయ్య భవన్ ఫంక్షన్ హాల్ లో తహసీల్దార్ సంతోష్ శుక్రవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. బీసీలు 33 మందికి, ఎస్సీలు ఏడుగురికి, ఎస్టీ ఒకరికి, ముస్లిం మైనారిటీలు ఏడుగురికి చెక్కులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గిర్దావర్లు ప్రశాంత్, చందర్, జీపీవోలు మధుకర్, రాజ్ కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
