మెగాస్టార్, సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతోనే నా కల  నెరవేరింది : తమన్నా

మెగాస్టార్, సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతోనే నా కల  నెరవేరింది : తమన్నా

కెరీర్ స్టార్ట్ చేసి పద్దెనిమిదేళ్లు దాటినా.. వరుస క్రేజీ ప్రాజెక్టులతో  బిజీగా ఉంది తమన్నా. ఆమె చిరంజీవితో కలిసి నటించిన  ‘భోళా శంకర్’ ఆగస్టు 10న విడుదలవుతుంటే, రజినీకాంత్‌‌తో నటించిన ‘జైలర్’ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా తమన్నా చెప్పిన ఇంటరెస్టింగ్‌‌ విశేషాలు. ‘‘మెగాస్టార్, సూపర్ స్టార్ చిత్రాల్లో నటించడంతోనే నా కల నెరవేరింది. పైగా రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌‌లో రిలీజ్ అవడం చాలా ఆనందంగా, ఎక్సయిటింగ్‌‌గా ఉంది. చిరంజీవి గారితో సైరాలో చేసినా.. డ్యాన్స్ చేసే అవకాశం రాలేదు. ఇందులో మాత్రం మిల్కీ  బ్యూటీ పేరుతో సాంగ్ చేసే చాన్స్ రావడం అదృష్టం. ఇదొక  రొమాంటిక్ మెలోడి.  హుక్ స్టెప్‌‌తో పాటు చాలా గ్రేస్ ఫుల్ మూమెంట్స్ ఉంటాయి. స్విట్జర్లాండ్‌‌లో ఈ సాంగ్ షూట్ జరిగింది.  డ్యాన్స్ లో ఇప్పుడు వాడుతున్న చాలా స్టయిల్స్ చిరంజీవి గారి దగ్గర నుంచే వచ్చాయి. ‘భోళా శంకర్’ నా కెరీర్‌‌‌‌లోనే స్పెషల్  సినిమా. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్ అయినా దర్శకుడు మెహర్ రమేష్ చాలా మార్పులు చేశారు. నా పాత్రకు హ్యూమర్  ఉంటుంది.

నిజానికి నా పాత్ర ఒరిజినల్‌‌లో అంత ఉండదు. ఇందులో మాత్రం చాలా డిఫరెంట్‌‌గా క్యారెక్టర్ డిజైన్ చేశారు. ‘కాళిదాసు’ తర్వాత సుశాంత్‌‌తో కలిసి యాక్ట్ చేయడం హ్యాపీ. కీర్తి సురేష్ బెస్ట్ యాక్టర్. తను ఇంటెన్స్ సీన్స్‌‌తో పాటు అన్ని ఎమోషన్స్‌‌ని సెటిల్డ్‌‌గా  బ్యాలెన్స్ చేస్తుంది. తనతో కలిసి పని చేయడాన్ని చాలా ఎంజాయ్ చేశా. ఇక జైలర్ విషయానికి వస్తే.. అందులో స్మాల్ పార్ట్‌‌లో కనిపిస్తా. రజినీ సర్‌‌‌‌తో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం మెమొరబుల్ ఎక్స్‌‌పీరియెన్స్. ఇందులో ‘కావాలయ్య’ పాట చాలా బాగా రీచ్ అయ్యింది. అలాగే తమిళంలో ‘అరణం’ అనే సినిమా చేస్తున్నా. మలయాళంలో ‘బాంద్ర’  విడుదలకు సిద్ధంగా ఉంది.  హాట్ స్టార్‌‌‌‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నా’’.