అల్లాదుర్గంలోని పెట్రోల్ బంక్​లో కల్తీ

అల్లాదుర్గంలోని పెట్రోల్ బంక్​లో కల్తీ

అల్లాదుర్గం, వెలుగు: అల్లాదుర్గం సమీపంలోని ఇండియన్ ఆయిల్​ పెట్రోల్ బంకులో పెట్రోల్​లో నీళ్లు వచ్చాయని వినియోగదారుడు ఆందోళన వ్యక్తం చేశాడు.  టేక్మాల్​ మండలం బొడ్మట్​పల్లి కి  చెందిన రాజు తన బైక్​లో అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద నేషనల్ హైవే 161 పక్కన ఉన్న ఇండియన్ అయిల్​ పెట్రోల్  బంకులో పెట్రోల్ పోయించుకొని వెళ్లిపోయాడు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాక బైక్​ సడన్​గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ ని పిలిపించి చూయించాడు. 

ట్యాంక్​లో  పెట్రోల్ ను బాటిల్​లో నింపగా అందులో పెట్రోల్​ లో  నీళ్లు కలిసినట్టు తేలడంతో ఆ యువకుడు కంగు తిన్నాడు.  సదరు ఇండియన్ ఆయిల్​ పెట్రోల్ బంక్ కు వెళ్లి  నిర్వహకులను నిలదీసి అడగ్గా తమకు ఎలాంటి సంబంధం లేదని చేతులెత్తేశారు. కల్తీ పెట్రోల్​విక్రయిస్తున్న సదరు బంక్​ మీద చర్యలు తీసుకోవాలని  బాధితుడు రాజు తహసీల్దార్​కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు.