
కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్స్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పా రంజిత్ తెరకెక్కిస్తున్నాడు. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేశారు.
బ్రిటీష్ వాళ్ల పరిపాలన సమయంలో భూమిలోని బంగారం వెలికి తీసేందుకు స్థానిక తెగల వాళ్లను పనిలో పెట్టుకుంటారు. అలాంటి ఓ తెగ నాయకుడిగా తన వాళ్లను కాపాడుకునేందుకు దేనికైనా తెగించే వ్యక్తిగా విక్రమ్ కనిపించాడు. విల్లు, బరిసెలు, ఈటెలతో చేసిన యాక్షన్ సీక్వెన్సులు, బ్లాక్ పాంథర్‌తో విక్రమ్ చేసిన ఫైట్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా ఈ సినిమా ఉండబోతోందని ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.