Ranji Trophy 2024: క్రికెట్‌లో సంచలనం.. చివరి వికెట్‌కు 232 పరుగులు

Ranji Trophy 2024: క్రికెట్‌లో సంచలనం.. చివరి వికెట్‌కు 232 పరుగులు

రంజీ ట్రోఫీలో అద్భుతం చోటు చేసుకుంది. ఇద్దరు బ్యాటర్లు ఏకంగా 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా 10 వికెట్ కు ఈ భాగస్వామ్యం నెలకొల్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ముంబై క్రికెటర్లు తనుష్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే  మంగళవారం (ఫిబ్రవరి 27) 10, 11 స్థానాల్లో బ్యాటింగ్‌ చేసి సెంచరీలు బాదేశారు. బరోడాతో జరిగిన రంజీ ట్రోఫీ 2024 క్వార్టర్‌ఫైనల్‌లో వీరు ఈ ఘనతను అందుకున్నారు. 

78 ఏళ్ల ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఒక జట్టులోని చివరి ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1946లో ఓవల్‌లో భారత్,  సర్రే మధ్య జరిగిన మ్యాచ్‌లో చందు సర్వాతే, షూటే బెనర్జీ మాత్రమే ఈ ఘనత సాధించారు. పదో నెంబర్ బ్యాటర్ కోటియన్ 120 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. దేశ్‌పాండే 123 పరుగులకు చివరి వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో ముంబై తమ రెండో ఇన్నింగ్స్ లో  569 పరుగులు చేసి బరోడా ముందు 606 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ALSO READ :- NAM vs NEP: 33 బంతుల్లో సెంచరీ.. నమీబియా బ్యాటర్ వరల్డ్ రికార్డ్

 లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో బరోడా ప్రస్తుతం 2 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. క్రీజ్ లో మోలియా (50) కెప్టెన్ సోలంకి (5) ఉన్నారు. అంతకు ముందు ముషీర్ ఖాన్(203) డబుల్ సెంచరీతో ముంబై తమ తొలి ఇన్నింగ్స్ లో 383 పరుగులు చేసింది. బరోడా తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులకు ఆలౌటైంది.