దర్శనానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన తనుశ్రీ దత్తా

దర్శనానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైన తనుశ్రీ దత్తా

బాలీవుడ్‌ హీరోయిన్‌ తనుశ్రీ దత్తా కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహాకాళ్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్తుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. తనుశ్రీ కాలికి గాయాలు కావడంతో ప్రథమ చికిత్స చేసి కుట్లు వేశారు. ప్రమాదం గురించి స్వయంగా తనుశ్రీ దత్తా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు 'ఈ రోజు నా జీవితంలో సాహసోపేతమైనది. గుడికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కాలికి కుట్లు వేశారు. ఎలాగైతేనేం దర్శనం చేసుకున్నాను. జై మహాకాళ్‌' అంటూ పోస్ట్‌ చేశారు. ప్రమాదం జరిగినప్పటికీ కుట్లు వేసుకున్న అనంతరం తనుశ్రీ దర్శనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తల కోసం..

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కాంగ్రెస్ మండిపాటు

పవన్ హన్స్ వాటాల అమ్మకంపై అనుమానాలున్నయ్