వడ్ల ట్రాక్టర్ తో కలెక్టరేట్ కు.. తప్పెట్ల మొర్సు గ్రామం రైతు

వడ్ల ట్రాక్టర్ తో కలెక్టరేట్ కు.. తప్పెట్ల మొర్సు గ్రామం రైతు

అయిజ, వెలుగు: గట్టు మండలం తప్పెట్ల మొర్సు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతు వడ్లను గట్టులోని పీఏసీఎస్​ కొనుగోలు కేంద్రంలో అమ్మాడు. ఆ వడ్లను గట్టులోని ఓ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్  మిల్లుకు కేటాయించగా, మిల్లర్​ వడ్లను అన్ లోడ్ చేసుకోలేదు. దీంతో న్యాయం చేయాలంటూ వడ్ల ట్రాక్టర్ తో  కలెక్టరేట్​కు బయలుదేరాడు. 

విషయం తెలుసుకున్న కలెక్టర్  సంతోష్  మిల్లర్ తో మాట్లాడి వడ్లు తీసుకోవాలని ఆదేశించారు. రైతు మిల్లుకు వెళ్లి వడ్లు ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అన్ లోడ్  చేశాడు.