
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లు మరోసారి రూటు మార్చారు.. శ్రీకాళహస్తి నుంచి పిచ్చాటూరు మార్గంలో ని కాలంగి డ్యామ్ దగ్గర నిల్వ ఉంచిన దుంగలు రవాణా చేయడానికి ప్రయత్నించారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది కి వచ్చిన సమాచారంతో చాకచక్యంగా చుట్టుముట్టారు. మొదట ఫైలెట్ గా వ్యవహరిస్తున్న వ్యక్తిని పట్టుకుని అతనితో నిల్వ ఉంచిన ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికే టాటా ఏస్ వాహనంలోకి ఎక్కిస్తున్న దుంగలతో సహా నలుగురు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరి నుంచి ఒక ద్విచక్ర వాహనం, టాటా ఏస్ వాహనం, ఐదుగురు స్మగ్లర్లును పట్టుకున్నారు. ఎవ్వరికి తెలియకుండా టాటా ఏస్ లో రవాణా చేసేందుకు యత్నించారు. స్మగ్లర్లు అందరూ స్థానిక ప్రాంతాలకు చెందిన వారే. కాలంగికి చెందిన సూర్య, పాల మంగళంకు చెందిన దొరవేలు, ఏర్పేడు శివయ్య, మంగళం నారాయణ, తిరుపతికి చెందిన వరదయ్య ను పట్టుకున్నారు. సంఘటన స్థలంలో మొత్తం 25 ఎర్రచందనం దుంగలు, డాగ్ స్క్వాడ్ తో మరో మూడు దుంగలు.. మొత్తంగా 28 దుంగలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది.