కూసుమంచి, వెలుగు : కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామ సమీపంలో శనివారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు 180 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎస్సై నాగరాజు వివరాల ప్రకారం కొందరు వ్యక్తులు ఇంటింటికీ తిరిగి తక్కువ ధరలకు బియ్యం కొని, వివిధ ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.
వీటిని మల్లేపల్లి వద్ద లారీ, టాటా మిని ఏసీలో లోడు చేసి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే నేలకొండపల్లి పరిధిలో మోటాపురం గ్రామం వద్ద బోలేరో వాహనంలో సుమారు 30 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.