V6 News

టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివినోళ్లకు అవకాశం.. మిస్సవకండి..

టాటా ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. ఐటీఐ, డిప్లొమా, బీటెక్ చదివినోళ్లకు అవకాశం.. మిస్సవకండి..

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్  (టీఐఎఫ్ఆర్) ఇంజినీర్, ట్రేడ్స్​మ్యాన్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 9.

విభాగాల వారీగా ఖాళీలు:  ఇంజినీర్ (డి) (మెకానికల్) 1, జూనియర్ ఇంజినీర్ (బి) (మెకానికల్) 1, ట్రేడ్స్​మ్యాన్ (బి) (వండ్రంగి)1,  ట్రేడ్స్​మ్యాన్ (బి) (ఫిట్టర్) 1,  ట్రేడ్స్​మ్యాన్ (బి) (మెషినిస్ట్ - మిల్లర్)1, ప్రాజెక్ట్ సైంటిఫిక్ ఆఫీసర్ (సి) 1, లైబ్రరీ ట్రైనీ 3, టెంపరరీ వర్క్  అసిస్టెంట్ 2.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్/ ఇండస్ట్రియల్/ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ లేదా పీహెచ్​డీ పూర్తిచేసి ఉండాలి. రెండేండ్ల అనుభవం ఉండాలి.

మెకానికల్ ఇంజినీరింగ్​లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి. 

కార్పెంటర్, ఫిట్టర్, మెషినిస్ట్– మిల్లర్​లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి. 

ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్​లో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. ఏడాది అనుభవం ఉండాలి. 

గ్రాడ్యుయేషన్​తోపాటు లైబ్రరీ సైన్స్​లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

పదో తరగతితోపాటు కనీసం ఏడాది సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 28 నుంచి 35 ఏండ్ల మధ్యలో ఉండాలి.

లాస్ట్ డేట్: మే 16.

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాకు వెబ్​సైట్ www.tifr.res.inను సందర్శించండి.