టాటా మోటార్స్ నుంచి మూడు ట్రక్కులు

టాటా మోటార్స్ నుంచి మూడు ట్రక్కులు

కమర్షియల్​ వెహికల్స్​ తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఇంట్రా వీ70, ఇంట్రా, వీ20 గోల్డ్, ఏస్​హెచ్​టీ ప్లస్​ ట్రక్కులను తీసుకొచ్చింది. ఈ కొత్త వెహికల్స్ ఎక్కువ దూరాలకు ఎక్కువ పేలోడ్‌‌‌‌‌‌‌‌లను మోసుకెళ్తాయని కంపెనీ తెలిపింది.

  పట్టణ  గ్రామీణ ప్రాంతాల్లో అధిక లాభాలను,  ఉత్పాదకతను అందిస్తాయని పేర్కొంది. ఇంట్రా వీ70 పేలోడ్​ 1,700 కేజీలు కాగా, ఇంట్రా వీ20 గోల్డ్​ పేలోడ్​ 1,200 కిలోలు. ఏఎస్​హెచ్​టీ ప్లస్​పేలోడ్​ 900 కిలోలు. వీటి బుకింగ్‌‌‌‌‌‌‌‌లు  దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టాటా మోటార్స్ సీబీ డీలర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లలో మొదలయ్యాయి.