
న్యూఢిల్లీ: ‘పీపుల్స్ కార్ ’గా రతన్ టాటా పేర్కొన్న నానో ఉత్పత్తిని టాటా మోటార్స్ ఆపేసింది. గత ఏడాది ఒక్క కారును కూడా తయారు చేయలేదని తెలిపింది. అయితే, ఫిబ్రవరిలో మాత్రం ఒకే ఒక్క కారును అమ్మగలిగింది. ఈ కారు తయారీని నిలిపివేస్తున్నట్టు త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నా యి. 2018లో ఈ కంపెనీ 88 యూనిట్లను తయారు చేయగా, 82 యూనిట్లను అమ్మింది. అయితే ప్రస్తుతం విధానంలో నానో బీఎస్–6 కారును తయారు చేయలేమని ప్రకటించింది. టాటా మోటార్స్ 2008లో తొలిసారిగా నానో కారును ప్రదర్శించింది. అయితే దీని అమ్మకాలు క్రమంగా తగ్గు తూనే వచ్చాయి. దీంతో ప్రొడక్షన్ ను నిలిపివేసింది.