టాటా బండ్లపై రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్లు

టాటా బండ్లపై రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ ఈ నెలలో కొన్ని మోడళ్లపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. 2023 స్టాక్‌‌‌‌లపై రూ. 1.25 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తున్నామని తెలిపింది. హారియర్,  సఫారీలపై భారీ ప్రయోజనాలు ఉన్నాయి.  ఈ డిస్కౌంట్‌‌‌‌లలో రూ. 75వేల నగదు తగ్గింపులు,  టాప్-స్పెక్ ఏడీఏఎస్ -ఎక్విప్డ్ వేరియంట్‌‌‌‌లపై రూ. 50వేల వరకు ఎక్స్‌‌‌‌ఛేంజ్ బోనస్‌‌‌‌లు ఉన్నాయి. నాన్- ఏడీఏఎస్​ వేరియంట్లపైనా రూ.  లక్ష వరకు ప్రయోజనాలను పొందవచ్చు. గత ఏడాది ఫేస్‌‌‌‌లిఫ్టెడ్ మోడల్స్  రూ. 70వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. 

సఫారి మాదిరిగానే, టాటా హారియర్ 2023 ప్రీ-ఫేస్‌‌‌‌లిఫ్ట్ స్టాక్‌‌‌‌లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఫేస్‌‌‌‌లిఫ్టెడ్ మోడల్‌‌‌‌లు రూ. 70వేల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి.  టాటా టియాగో 2023 మోడళ్లపై రూ. 80వేల వరకు, టాటా టిగోర్ 2023 సంవత్సరం యూనిట్లపై రూ. 75వేల వరకు ఆదా చేసుకోవచ్చు. 2023 టాటా నెక్సాన్  మోడల్ ఇయర్ యూనిట్లపై రూ. 45వేల వరకు ఆఫర్లు పొందవచ్చు. టాటా ఆల్ట్రోజ్ పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వేరియంట్ల రూ. 55వేల వరకు తగ్గింపు ఇస్తామని టాటా తెలిపింది.