టాటా కొత్త కారు..సింగిల్ చార్జ్తో 315 కిలోమీటర్ల ప్రయాణం

టాటా కొత్త కారు..సింగిల్ చార్జ్తో 315 కిలోమీటర్ల ప్రయాణం

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాహన వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ముగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే ముందు ఆ వాహనం ఎంత మైలేజ్ ఇస్తుందన్నది కస్టమర్లు ప్రధానంగా చూసే అంశం. ఇటువంటి వారి కోసమే టాటా మోటర్స్ కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. సింగిల్ ఛార్జ్తో 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.

అప్డేటెడ్ 2022 టిగోర్ ఈవీని టాటా మోటర్స్ ఇటీవల విడుదల చేసింది. ఈ టిగోర్ ఈవీ ధర రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే 2022 టిగోర్ ఈవీ కొత్త మాగ్నెటిక్ రెడ్ కలర్ సహా సరికొత్త ఫీచర్ అప్ గ్రేడ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ అప్డేటెడ్ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ సెడాన్ XE, XT, XZ+, XZ+ LUX వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు వెళ్లొచ్చు.

2022 టిగోర్ ఈవీ 10 కొత్త ఫీచర్లతో లభిస్తుంది. లెథెరెట్ అప్ హోల్స్టరీ, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, ఆటో హెడ్ల్యాంప్స్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్తో ఈ వెహికిల్ ఆకట్టుకుంటోంది. మల్టీ మోడ్ రీజెన్, కనెక్టడ్ కార్ టెక్నాలజీ -Zconnect, స్మార్ట్ వాచ్ కనెక్టివిటీ, ఐటీపీఎమ్ఎస్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్ వంటి వాటిని ఆఫర్ చేస్తోంది.