
న్యూఢిల్లీ: కోఆపరేటివ్ సెక్టార్ ఈ ఏడాది చివరి నాటికి ‘భారత్’ బ్రాండ్‌తో టాక్సీ సేవలను ప్రారంభించాలని చూస్తోంది. ఓలా, ఉబర్‌లకు పోటీ ఇవ్వనుంది. 8 కోఆపరేటివ్‌లు కలిసి రూ.300 కోట్ల ఆథరైజ్డ్ క్యాపిటల్‌తో ఈ బిజినెస్‌ను స్టార్ట్ చేయనున్నాయి. ఢిల్లీ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో 200 మంది డ్రైవర్లు ఇప్పటికే జాయిన్ అయ్యారని అంచనా. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సీడీసీ), ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ (ఐఎఫ్‌ఎఫ్‌సీఓ), గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) లతో సహా ఎనిమిది ప్రముఖ కోఆపరేటివ్‌లు కలిసి మల్టీ-స్టేట్ సహకారి టాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేశాయి.
ఈ ఏడాది జూన్ 6న ఈ సంస్థను రిజిస్టర్ చేశాయి. డ్రైవర్లకు మెరుగైన ఆదాయం, ప్రయాణీకులకు సురక్షిత, సరసమైన సేవలను కోఆపరేటివ్‌లు అందిస్తాయని యూనియన్ మినిస్ట మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కాగా, ఈ బిజినెస్ కోసం ప్రభుత్వం ఫండ్స్ అందివ్వడం లేదు. రైడ్-హెయిలింగ్ యాప్ కోసం టెక్నాలజీ భాగస్వామిని త్వరలో ఎంచుకోనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి యాప్ సిద్ధం అవుతుందని అంచనా. ఐఐఎం -బెంగళూరుతో కలిసి మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు.