Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్

Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్

ఓవైపు టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. లేఆఫ్స్ తో టెకీలు ఆందోళన చెందుతున్నారు.. 2024 లో భారీగానే లేఆఫ్ లు ఉంటాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్న క్రమంలో.. ప్రముఖ టెక్ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మాత్రం జాబ్ కావాలనుకునే వారికి మంచి ఆఫర్ ఇస్తోంది. క్విక్ జాయినర్ ఇన్సెంటివ్ ప్లాన్ పేరుతో టీసీఎస్ గొప్ప ఆఫర్ ను ప్రకటించింది. ఒక నెల రోజుల్లో కంపెనీలో జాయిన్ అయినవారికి ఏకంగా 40 వేల రూపాయల ఇన్సెంటివ్ ఇస్తామని వెల్లడించింది. ఇది సీనియర్ ఉద్యోగులకు అని తెలిపింది. అయితే ఇక్కడో ట్విస్ట్ కూడా ఉంది.. ఉద్యోగి జాయిన్ అయిన ఆరు నెలలలోపు ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే మొత్తం రికవరీ చేస్తామని నిబంధన కూడా పెట్టింది. 

టీసీఎస్ కంపెనీ రిక్రూట్ మెంట్ విషయంలో ఇటీవల క్లారిటీ ఇచ్చింది.. కంపెనీ నియామకాలను తగ్గిస్తుందన్న వార్తలను తోసిపుచ్చింది. అలా చేసే ఆలోచన కూడా లేదని ప్రకటించింది. హెడ్ కౌంట్ రాబడి , లాభాల పరంగా టీసీఎస్ అతిపెద్ద భారతీయ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోర్టర్.. టీసీఎస్ లో 6 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

టీసీఎస్ సీజనల్ వీక్ క్వార్టర్స్ లో నికర లాభంలో 8.2 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 11,735 కోట్లకు చేరుకుంది. హౌసింగ్ మార్కెట్లో భారీ వృద్దిని సాధించింది. అయితే టీసీఎస్ అతిపెద్ద మార్కెట్ US లో 3 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. ఇది దాని ఆదాయంలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ. 

ఈ క్విక్ జాయినర్ ఇన్సెంటివ్ ప్లాన్ గురించి టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కృతి వాసన్ చెపుతూ.. మాకు ఎక్కువ పనికోసం ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం.. వాస్తవానికి రిక్రూట్ మెంట్ తగ్గించే యోచన మాకు లేదు.. మేం గతంలోలాగే..ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం.కంపెనీ అభివృద్ధికోసం మా ప్రణాళికను మార్చాల్సి ఉంది కానీ.. ఉద్యోగ నియామకాలు తగ్గించాల్సిన అవసరం లేదన్నారు. 

ALSO READ :- విద్య, వైద్యం పేరుతో మల్లారెడ్డి కుటుంబం కోట్లు దోచుకుంటుంది: మైనంపల్లి రోహిత్