ఏపీకి వైసీపీ తెగులు పట్టుకుంది.. దీనికి మందు జనసేన టీడీపీ ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్

 ఏపీకి వైసీపీ తెగులు పట్టుకుంది..  దీనికి మందు జనసేన టీడీపీ ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్

రాజమండ్రిలో జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన, టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌లో ఈ సమావేశం జరిగింది.  సమావేశం అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ .... ఏపీకి వైసీపీ తెగులు పట్టుకుంది.. ఈ తెగులుకు వ్యాక్సిన్...   టీడీపీ, జనసేన ఏర్పడాలన్నారు.  వైసీపీ ప్రభుత్వం పోవాలి... జనసేన, టీడీపీ ప్రభుత్వం రావాలంటూ... చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారంటూ.. టెక్నికల్ కారణాలు చూపుతూ చంద్రబాబుకు బెయిల్ రాకుండా వైసీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉండి... ఏపీ ప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రతీ కార్యక్రమానికి ఇరు పార్టీల కేడర్‌ హాజరయ్యేలా కార్యచరణ ప్రణాళిక రూపొందించారు.  ఉమ్మడి ఉద్యమాలు చేయాలని టీడీపీ, జనసేన పార్టీలు నిర్ణయం తీసుకున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు.  అస్థిరత ఆంధ్రప్రదేశ్ కు సుస్థిరత ఇవ్వాలంటూ..  ఏపీ ప్రజల అభివృద్దే తమ లక్ష్యమన్నారు. తాము వైసీపీ పార్టీకి వ్యతిరేకం కాదంటూ.. ఆపార్టీ విధానాలను తప్పుపడుతున్నామని జనసేనాని అన్నారు.  వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమంటూ... వైసీపీ ప్రభుత్వ పాలనను తప్పు పట్టారు.  వైసీపీ అధికారంలోకి రాకముందు  మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని... ఇప్పుడు విచ్చల విడిగా మద్యాన్ని అమ్ముతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.  ప్రత్యర్థులను భయపెట్టి కేసులు పెడుతున్నారని అన్నారు

టీడీపీ తరపున మీటింగ్ కు హాజరైన వారిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. అలాగే.. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, పీఏసీ ఛైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఉన్నారు. ఇక జనసేన పార్టీ తరపున.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మహేంద్ర రెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, పీఏసీ సభ్యురాలు పాలవలస యశస్వి, నరసాపురం నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి బొమ్మిడి నాయకర్ హాజరయ్యారు.

ALSO READ :- AFG vs PAK: దంచికొడుతున్న ఆఫ్ఘన్ ఓపెనర్లు.. దుఃఖాన్ని ఆపులేకపోతున్న పాక్ టీమ్ డైరెక్టర్