పలాసకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు

పలాసకు వెళ్తున్న లోకేష్ ను అడ్డుకున్న పోలీసులు

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పలాసకు వెళ్తున్న లోకేష్ ను కొత్త రోడ్డు జంక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారు.  ఈక్రమంలోనే నారా లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవటాన్ని నిరసిస్తూ రోడ్డుపైనే ఆందోళనకు దిగారు. అనంతరం లోకేష్ ను అరెస్ట్ చేసి రణస్థలం పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేష్ తోపాటు కొంతమంది టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాసలో భూకబ్జాలపై వైసీపీ,టీడీపీ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. మరోవైపు పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో ర్యాలీలకు, బహిరంగసభలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఈ సందర్భంగా  నారా లోకేష్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.