 
                                    మహబూబ్‌నగర్ రూరల్, వెలుగు: స్టూడెంట్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ టీచర్‌పై పోక్సో కేసు నమోదైంది. మహబూబ్‌నగర్ రూరల్ ఎస్సై విజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని శాషాబగుట్ట గవర్నమెంట్ హైస్కూల్‌లో పెరుమాళ్ల కృష్ణస్వామి తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నాడు.
అతడు స్టూడెంట్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఓ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై విజయ్‌కుమార్ తెలిపారు.

 
         
                     
                     
                    