క్రిప్టో కన్నా వేగంగా టీమిండియా ఫామ్ కోల్పోతుంది: సెహ్వాగ్

క్రిప్టో కన్నా వేగంగా టీమిండియా ఫామ్ కోల్పోతుంది: సెహ్వాగ్

బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత జట్టు  సిరీర్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. భారత క్రికెట్ జట్టు క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా ఫామ్ కోల్పోతుందన్నాడు. ప్లేయర్లు గానీ, టీం మేనేజ్మెంట్ గానీ టీ20 లపై చూపెట్టినంత శ్రద్ధ వన్డేలపై చూపెట్టట్లేదని మండిపడ్డాడు. టీం ఇండియాలో ఆటగాళ్ల మార్పులకు, మేల్కొలుపులకు ఇదే సరైన సమయమని ఆసక్తికర వాక్యలు చేశాడు. 

అయితే, వచ్చే ఏడాది భారత్ ఆతిథ్యంలో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ సమయంలో ఆడే ప్రతీ సిరీస్ కీలకమే. జట్టు కూర్పుతో పాటు, ఆటగాళ్లు తమ ప్రతిభను బయటపెట్టడానికి ఇదే సరైన అవకాశం. రాబోయే రోజుల్లో కూడా భారత్ సెలక్షన్ కమిటీ ఇలాంటి తప్పులే చేసుకుంటూపోతే మరోసారి నిరాశ పడక తప్పదు అంటున్నారు క్రికెట్ ఎక్స్ పర్ట్స్.