'అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా ఒత్తిడి తెస్తారు: భారత ఆటగాళ్లపై ICC అంపైర్ వ్యాఖ్యలు!

'అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా ఒత్తిడి తెస్తారు: భారత ఆటగాళ్లపై ICC అంపైర్ వ్యాఖ్యలు!

సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు భారత ఆటగాళ్లు.. నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ఒత్తిడి తెస్తారంటూ ఐసీసీ అంపైర్‌ నితిన్‌ మీనన్‌ బాంబ్ పేల్చాడు. ఓ క్రీడా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్‌ మీనన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. 

'స్వదేశంలో మ్యాచ్‌ ఆడుతున్నపుడు భారత జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి. మైదానం అభిమానులతో కిక్కిరిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు అంపైర్లపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు. పరిస్థితి 50-50గా ఉన్నప్పుడు నిర్ణయాలు తమకు అనుకూలంగా వచ్చేలా ప్రయత్నిస్తారు. అయినప్పటికీ మేం తలొగ్గం. ఒత్తిడి తట్టుకుని నియంత్రణతో ఉండి దృష్టి మరలకుండా చూసుకుంటాం..' 

"మాకు ఇలాంటి పరిస్థితులలో ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో ముందుగానే శిక్షణ ఇస్తారు. అందుకే మేం వాళ్లేం చేసినా.. మా ఫోకస్ దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా దారి తప్పం. ఇండియాలో ఎన్నో మ్యాచులు ఆడాను. అవి నాలో అమితమైన ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. రిఫరీగానే కాకుండా ప్లేయర్‌గా కూడా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నా.." అని నితిన్ మీనన్ తెలిపాడు.

ఎవరీ నితిన్‌ మీనన్‌?

భారత్ నుంచి ఐసీసీ ప్యానల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతికొద్ది అంపైర్లలో నితిన్ మీనన్ ఒకడు. ఇప్పటివరకూ 22 టెస్టులు, 48 వన్డేలు, 61 ఇంటర్నేషనల్ టీ20 మ్యాచులకు నితిన్ మీనన్ అంపైర్ గ వ్యవహరించాడు. అతని తండ్రి నరేంద్ర నారాయణ్ మీనన్ కూడా అంపైర్ గా పనిచేశారు.

ప్రస్తుతం ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్‌లో చివరి మూడు టెస్ట్‌లకు నితిన్ మీనన్ అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు.