మిడిలార్డర్‌‌కు గిల్‌‌! ఓపెనర్‌‌గా మయాంక్‌‌..

మిడిలార్డర్‌‌కు గిల్‌‌! ఓపెనర్‌‌గా మయాంక్‌‌..

కాన్పూర్‌‌: టీమిండియా హెడ్‌‌ కోచ్‌‌గా రాహుల్‌‌ ద్రవిడ్‌‌ తన మార్కు చూపించబోతున్నాడు. తొలి టీ20 సిరీస్​లోనే క్లీన్​స్వీప్​ విక్టరీ అందుకున్న ద్రవిడ్​.. టెస్ట్ టీమ్​​ లైనప్‌‌లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. న్యూజిలాండ్‌‌తో గురువారం మొదలయ్యే రెండు టెస్టుల సిరీస్‌‌కు యంగ్‌‌స్టర్స్‌‌తో సరికొత్త కాంబినేషన్​ను తీసుకొచ్చేందుకు ప్లాన్స్‌‌ వేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇన్నాళ్లూ ఓపెనర్‌‌గా సేవలందించిన శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ను మిడిలార్డర్‌‌కు పంపనున్నాడు. విరాట్‌‌ కోహ్లీ, రోహిత్‌‌ శర్మ, రిషబ్‌‌ పంత్‌‌లాంటి అటాకింగ్‌‌ బ్యాటర్లు ఈ సిరీస్​కు అందుబాటులో లేకపోవడంతో.. గిల్‌‌తో మిడిలార్డర్​ను మరింత స్ట్రాంగ్​గా మార్చాలని  భావిస్తున్నాడు. కాన్పూర్‌‌లో గురువారం మొదలయ్యే ఫస్ట్‌‌ టెస్ట్‌‌ నుంచే దీనిని అమల్లోకి తీసుకురానున్నాడు. ఈ మేరకు ఇప్పటికే గిల్​కు టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ నుంచి సమాచారం అందింది. సెకండ్‌‌ టెస్ట్‌‌కు విరాట్‌‌ అందుబాటులోకి వస్తున్నా.. రోహిత్‌‌ మాత్రం సౌతాఫ్రికా టూర్‌‌లోనే టీమ్‌‌తో కలుస్తాడు. ఈ లోగా ‘మిడిల్‌‌’ ప్రయోగాలు సక్సెస్‌‌ అయితే.. జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లను అటు, ఇటు మార్చే వెసులుబాటు ఉంటుందని ద్రవిడ్‌‌ ఆలోచన. 

ఓపెనర్‌‌గా మయాంక్‌‌..
రోహిత్‌‌ అందుబాటులో లేపోవడంతో ఓపెనింగ్‌‌లో రాహుల్‌‌కు జతగా మయాంక్‌‌కు మళ్లీ అవకాశం ఇవ్వనున్నారు. అయితే ఇది ఎన్ని రోజులు ఉంటుందో క్లారిటీ లేదు. ఒకవేళ మయాంక్‌‌ రాణించినా.. రోహిత్‌‌ వస్తే మాత్రం టీమ్‌‌లో అతనికి ప్లేస్‌‌ దొరకడం కూడా కష్టమవుతుంది. కానీ ఓపెనర్‌‌ నుంచి సడెన్‌‌గా గిల్‌‌ను మారిస్తే.. అతను ఫామ్‌‌ కోల్పోతే పరిస్థితి ఏంటి? దీనికి ద్రవిడ్‌‌ వద్ద బ్యాకప్‌‌ ప్లాన్స్‌‌ ఉన్నాయా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి.  అయితే గిల్‌‌ను మిడిలార్డర్​కు తీసుకురావడం మంచి ఐడియానే అని మాజీ సెలెక్టర్‌‌ జతిన్‌‌ పరాంజపే అన్నాడు.  కోహ్లీ కాకుండా అపోజిట్‌‌ టీమ్‌‌పై అటాకింగ్‌‌ చేసే మరో మిడిలార్డర్​ ప్లేయర్‌‌ కూడా అందుబాటులో ఉండాలన్నది  నేషనల్‌‌ సెలెక్షన్‌‌ కమిటీ అభిప్రాయంగా కనిపిస్తోంది. పుజారా, రహానె, విహారి ఆట ఒకే రకంగా ఉండటంతో.. గిల్‌‌ను అటాకర్‌‌గా మారిస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని లెక్కలేస్తున్నారు.  

విరాట్‌‌ వస్తే ఎలా?
ముంబై టెస్ట్‌‌కు విరాట్‌‌ అందుబాటులోకి వస్తే.. గిల్‌‌ను ఎక్కడ ఆడిస్తారు? ఒకవేళ గిల్‌‌ మంచి స్కోర్లు చేసి.. పుజారా, రహానెలో ఒకరు ఫెయిల్‌‌ అయితే పరిస్థితి ఏంటి? వీటికి  ద్రవిడ్‌‌ సమాధానం వెతకాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిడిలార్డర్‌‌ మొత్తాన్ని మార్చే చాన్స్‌‌ లేకపోయినా.. పరిస్థితిని బట్టి రాహుల్‌‌, గిల్‌‌ ప్లేస్‌‌లను మార్చుకోవచ్చని పరాంజపే అంటున్నాడు. ఇండియాలో ఆడేటప్పుడు ఓపెనింగ్‌‌కు, మిడిలార్డర్‌‌కు పెద్దగా తేడా ఉండదన్నాడు. ఓవర్‌‌సీస్‌‌ కండీషన్స్‌‌లో మాత్రం స్పెషలిస్ట్‌‌ రోల్స్‌‌కు చాలా ప్రాధాన్యత ఉంటుందని చెప్పాడు.  ఓపెనర్‌‌గా ఆడిన ఎనిమిది మ్యాచ్‌‌ల్లో 3 హాఫ్‌‌ సెంచరీలు చేసిన గిల్‌‌ కొత్త బాధ్యతల్లో ఎంతవరకు కుదురుకుంటాడో చూడాలి. ఇక, మిడిలార్డర్‌‌ స్పెషలిస్ట్‌‌గా శ్రేయస్‌‌ అయ్యర్‌‌ను కూడా తీసుకున్నా తనకిప్పుడే చాన్స్‌‌ దొరకడం కష్టమే. ఓవరాల్‌‌గా ద్రవిడ్​ చేయబోతున్న ప్రయోగాలు సక్సెస్‌‌ అవుతాయో లేదో చూడాలి.