
అపార్ట్‌మెంట్‌లో 5వ అంతస్తులో తన ఇంటిని శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి ఓ మహిళా టెక్కీ మృతి చెందింది. ఈ ఘటన బెంగళూరులోని కడుగోడి సమీపంలోని దొడ్బనహళ్లిలో చోటుచేసుకుంది. మృతురాలిని దొడ్డబనహళ్లిలోని వింధ్యగిరి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న కుష్బూ ఆశిష్ త్రివేది (32)గా గుర్తించారు.
త్రివేది ఎప్పటిలాగే అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో ఉన్న తన ఇంటిని శుభ్రం చేస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి జారిపడి కింద పడిపోయింది. దీంతో త్రివేది తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, కానీ వైద్యులు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు.
ఖుష్బూ తండ్రి చంద్రకాంత్ త్రివేది ఫిర్యాదు మేరకు పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. సంఘటన జరిగినప్పుడు, ఆమె భర్త , అత్తమామలు ఫ్లాట్‌లో ఉన్నారు. కుష్బూకు ఏడేళ్ల క్రితం త్రివేది ఆశిష్ హరీష్ కుమార్‌ని పెళ్లాడింది. ఈ దంపతులకు పిల్లలు లేరు.