
హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతు ప్రకటించింది తీన్మార్ మల్లన్న టీం. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన తీన్మార్ మల్లన్న టీం సభ్యులు జిల్లా కన్వీనర్ మహమ్మద్ అఖిల్ పాషా, అసెంబ్లీ కన్వీనర్ చెకోటి రమేష్ .. మల్లన్న విడుదలైన వెంటనే హుజురాబాద్ ఎన్నికలలో ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేస్తామన్నారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓటమిలో తాము కీలక పాత్ర పోషిస్తామన్నారు. స్టేట్ కమీటీ ఆదేశాల మేరకు హుజురాబాద్ లో ఈటల రాజేందర్ కు మద్దతుగా ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. తీన్మార్ మల్లన్నను కాపాడాలని కోరేందుకే ఆయన భార్య మమత .. కేంద్ర ప్రభుత్వ సహాయం కోరారన్నారు.కొందరు మినహా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన వాళ్లలో చాలా మంది మల్లన్న టీం సభ్యులు కాదన్నారు.