
కొత్తపల్లి, వెలుగు : ఎస్జీఎఫ్ఐ అండర్-–17 క్రికెట్ టోర్నమెంట్ జోనల్ స్థాయిలో తేజస్ జూనియర్ కళాశాల విద్యార్థి బి.అభి ప్రతిభ చూపినట్లు ఆ కాలేజీ చైర్మన్ సీహెచ్ సతీశ్రావు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. అనంతరం జోనల్ స్థాయికి ఎంపికైన అభి, క్రికెట్ కోచ్ నరేన్ను అభినందించారు.