హైదరాబాద్, వెలుగు: కేవలం ఏఐ టెక్నాలజీలను వాడటంతో సరిపెట్టకుండా, ప్రపంచ మార్కెట్ల కోసం ఏఐ ఉత్పత్తులను, ఏఐ ఇంటెలెక్చువల్ ప్రొటోకాల్స్‌ను తెలంగాణ నుంచి అందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు.
సీఐఐ తెలంగాణ హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఏఐ సమిట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఏఐ ఆవిష్కరణల ఏర్పాటు చేసిన ఐకాన్ ద్వారా ఏఐ -ఫస్ట్ స్టార్టప్‌లు, పరిశోధన,- పరిశ్రమల అనుసంధానం, నైపుణ్యాభివృద్ధి, ఏఐ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మద్దతుతో 2035 నాటికి తెలంగాణను ప్రపంచంలోని టాప్ –20 ఏఐ హబ్‌లలో ఒకటిగా నిలపడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
‘‘మన రాష్ట్రం రూ.3.13 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించింది. ఇక్కడ 515 జీసీసీలు సుమారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఫ్యూచర్ సిటీలో ఏఐ సిటీ ఏర్పాటుతో పాటు 2035 నాటికి ప్రపంచంలోని టాప్– 20 ఏఐ హబ్‌లలో ఒకటిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని సంజయ్ వివరించారు.
