
- ఎర్ర సత్యనారాయణ
బషీర్‌బాగ్, వెలుగు: ముస్లిం రిజర్వేషన్ల పేరిట బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకునే కుట్ర చేస్తున్నదని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీసీ డిక్లరేషన్‌ను ముస్లిం డిక్లరేషన్‌గా బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. హైదర్ గూడలో శనివారం ఆయన మాట్లాడారు.
42 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల బిల్లులో ముస్లింలకు ఎలాంటి రిజర్వేషన్లు కేటాయించలేదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి , బీసీ బిల్లును ఆమోదింపజేయాలన్నారు. లేనిపక్షంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.