ఉగ్రవాదులతో సంబంధాలున్న ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ

ఉగ్రవాదులతో సంబంధాలున్న ఎంఐఎంతో టీఆర్ఎస్ దోస్తీ

తాము ముస్లీంలకు – క్రైస్తవులకు వ్యతిరేకం కాదని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. దుబ్బాక ఎన్నికల ఫలితాల విడుదల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన..దుబ్బాక లో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని, ఎన్నికల్లో తమ పార్టీ  విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వరదల వల్ల హైదరాబాద్ తో పాటు రైతులు నష్టపోయారని..కానీ ఇంతవరకు నష్టపోయిన రైతులకు పరిహారం అందలేదనన్నారు. వరదలు వరంగల్ లో సైతం వచ్చాయి కానీ అక్కడ ప్రజలకు రూ.10వేలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  కరోనా వస్తే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నీ ఆస్పత్రులకు తిరిగారని, బాధితుల్ని కేసీఆర్ ఎందుకు పరామర్శించలేదన్నారు. బీజేపీ ఇచ్చిన అభ్యంతరాలు సరిచేయకుండా..పరిశీలన అనంతరమే షెడ్యూల్ ఇవ్వాలి లేదంటే ఎన్నికలు అడ్డుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఉగ్రవాదులతో సంబంధాలున్న ఎంఐఎం తో టీఆర్ఎస్ స్నేహం చేస్తుందని ఎద్దేవా చేశారు. రాజకీయాలకు అతీతంగా రైతుల్ని ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.., సీఎం కేసీఆర్ కు సూచించారు.