ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్షలు చేసిండు

ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్షలు చేసిండు

హుజురాబాద్ లో కరెన్సీ నోటుకు.. కమలం పువ్వు గుర్తుకు మధ్య పోటీ జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన ఇవాళ హుజురాబాద్ బై పోల్ ప్రచారం ప్రారంభించారు. టీఆర్ఎస్ పంచే డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం బీజేపీకి వేయాలన్నారు. ఈటల రాజేందరే నిజమైన ఉద్యమకారుడని, కేసీఆర్ ఉద్యమంలో దొంగ దీక్షలు చేశారని విమర్శించారు.

కాగా, అంతకు ముందు హైదరాబాద్‌లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పలువురు బీజేపీ నేతలతో కలిసి బండి సంజయ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుజురాబాద్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మొదటి విడత పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. 

ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర చేపట్టారు బండి సంజయ్. 36 రోజుల పాటు.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగింది. 8 జిల్లాల్లోని 19 అసెంబ్లీ,  6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో నడిచారు. నిన్న హుస్నాబాద్ లో తొలివిడత ప్రజాసంగ్రాయ యాత్ర ముగిసింది. ఇవాళ అమ్మవారికి పూజలు చేశారు సంజయ్.

మరిన్ని వార్తల కోసం..

బడి కూలుతున్నా.. కొత్త బిల్డింగ్​ పూర్తి చేస్తలేరు

సీఆర్పీఎఫ్ బంకర్ సహా మూడు చోట్ల ఉగ్రదాడులు.. ఒకరు మృతి

భవానీపూర్ ప్రజలు కేంద్రం కుట్రలను తిప్పికొట్టారు: దీదీ