ఇయ్యాల రంగనాథస్వామి టెంపుల్​కు కేసీఆర్

ఇయ్యాల రంగనాథస్వామి టెంపుల్​కు కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ సోమవారం తమిళనాడులో పర్యటించనున్నారు. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయాన్ని సీఎం సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి 
బయల్దేరి మధ్యాహ్నం 2.10కి టెంపుల్ కు చేరుకోనున్నట్లు సీఎంవో వెల్లడించింది. సాయంత్రం 6.10కి  చెన్నై చేరుకొని ఐటీసీ హోటల్​లో బస చేస్తారని తెలిపింది. తిరిగి హైదరాబాద్​కు ఎప్పుడు 
వస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. అయితే ఈ టూర్ సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్​తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.