
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు కాంగ్రెస్ నేతలు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో TRS, BJP విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచుతున్నాయని ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ లో 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఉపఎన్నికను రద్దు చేయాలని ఈసీని కోరామన్నారు కాంగ్రెస్ నేతలు. శశాంక్ గోయల్ ని సస్పెండ్ చేసి.. కొత్త ఎన్నికల కమిషనర్‌ను పంపాలని విజ్ఞప్తి చేశామన్నారు. తమ ఫిర్యాదుపై ఈసీ సానుకూలంగా స్పందించి.. ఎంక్వైరీ చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.