సూర్యపేటలో రోడ్డు ప్రమాదం.. సీపీఐ నేత అయోధ్య మృతి

సూర్యపేటలో రోడ్డు ప్రమాదం.. సీపీఐ నేత అయోధ్య మృతి

సూర్యాపేట జిల్లాలో ఆగస్టు 6న ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ - విజయవాడ  ప్రధాన రహదారిపై సూర్యాపేట ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ముందు వెళ్తోన్న  లారీని వెనక నుంచి  కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో   సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య అక్కడికక్కడే మృతి చెందారు.

 మణుగూరు నుంచి హైదరాబాద్ కు  వైద్య పరీక్షల కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. లారీ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో కారు ఢీ కొట్టింది.  ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు తీవ్ర గాయాలైన  డ్రైవర్ రమేష్ ను  చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనతో కాసేపు హైవేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.