
హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆదాయం బాగా పడిపోయింది. దీంతో వారం రోజుల్లోనే రూ.4 వేల కోట్లను సర్కారు అప్పుగా తీసుకుంది. బాండ్ల అమ్మకం ద్వారా మంగళవారం రూ.2 వేల కోట్లు సేకరించింది. ఆర్బీఐ నిర్వహించిన ఈ బిడ్ ద్వారా ఈ రుణం తీసుకుంది. ఇందులో రూ. వెయ్యి కోట్లను రాబోయే ఆరేళ్లలో, మరో రూ. వెయ్యి కోట్లను 8 ఏళ్ల వ్యవధిలో చెల్లించనుంది. అలాగే ఈ నెల 13న బాండ్ల ఆక్షన్ ద్వారా రూ. 2 వేల కోట్లు రుణం పొందింది. పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.982 కోట్లను సోమవారం కేంద్రం రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.5 వేల కోట్లు వచ్చాయి. అత్యవసర సర్వీసులు, కరోనా కట్టడి కార్యక్రమాలు, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ కోసంఈ అప్పు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్టేట్ ఓన్ రెవెన్యూ, సెంట్రల్ ట్యాక్స్‌ల్లో వాటా, ఇతరత్రా ఆదాయం కలుపుకుంటే రాష్ట్రానికి నెలకు రూ.15 వేల కోట్లు రావాల్సి ఉండగా రూ.140 కోట్లే వచ్చాయంటూ ఆదివారం సీఎం కేసీఆర్ చెప్పారు. ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగుల జీతాల్లో కోత పెట్టింది.