కామారెడ్డిటౌన్, వెలుగు : తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటీవ్ అధికారుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకులుగా విలాస్‌కుమార్ వ్యవహరించారు.
ప్రెసిడెంట్‌గా ఎ.అంజిత్‌రావు ( ఆర్మూర్), జనరల్ సెక్రటరీగా ఎం.విక్రమ్‌కుమార్ ( కామారెడ్డి), అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎ. గంగాధర్ ( నిజామాబాద్), వైస్ ప్రెసిడెంట్‌గా భాస్కర్‌రావు ( బోధన్), ట్రెజరర్‌గా ప్రమోద్చైతన్య ఆర్గనైజింగ్ సెక్రటరీగా మల్లేశ్, జాయింట్ సెక్రటరీగా ఎ.వెంకటేశ్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా దిలీప్, మధుసూదన్‌రావు, తేజస్విని, శరత్ ఎన్నికయ్యారు.
