లక్ష 70 వేల ఇండ్ల సర్వే 

లక్ష 70 వేల ఇండ్ల సర్వే 
  • 9వేల కిట్ల పంపిణీ
  • ఒక్క డోసు వేసుకోని 12 వేల మంది గుర్తింపు

హైదరాబాద్​, వెలుగు: గ్రేటర్​లో ఫీవర్ సర్వేలో భాగంగా ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లలోనే  కొవిడ్ ​సింటమ్స్​ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ ​వేసుకోకుండా నిర్లక్ష్యం ఉన్నవారిలోనే ​థర్డ్​వేవ్​లో భాగంగా జ్వరం, జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్ తీవ్రంగా ఉంటున్నాయి. 3 రోజులుగా ఫీవర్​సర్వే కొనసాగుతుండగా, ఆదివారం నాటికి లక్షా70 వేల ఇండ్లకు హెల్త్​స్టాఫ్​వెళ్లి వివరాలు సేకరించారు. ఇందులో 9 వేల మందికి కరోనా సింటమ్స్​ ఉండడంతో హోమ్ ఐసోలేషన్ కిట్లను అందించారు.  ప్రతి ఇంటికి వెళ్లి హెల్త్​ కండీషన్ చెక్​ చేసి వ్యాక్సినేషన్ సమాచారం కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం సింప్టమ్స్ కనిపిస్తున్న వారిలో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోని వారే ఉన్నట్లు గుర్తిస్తున్నారు. ఫస్ట్​డోస్, రెండో డోస్ వేసుకోని వారితో పాటు రెండు డోస్​లు వ్యాక్సిన్​ తీసుకొని ఆరునెలలు దాటిన వారిలోనూ సింటమ్స్​ఎక్కువగా కనిపిస్తుండగా 40 శాతానికిపైగా వీరే ఉంటున్నారు. రెండో డోస్ తీసుకోని వారితో పాటు రెండు డోసుల వ్యాక్సిన్​వేయించుకుని ఆరునెలలు దాటిన వారు 50 శాతం ఉంటుండగా మిగతావారు 10 శాతం ఉన్నారు. 15 ఏండ్లు పైబడి,18 ఏండ్లు పైన ఉన్నవారు  కూడా వ్యాక్సిన్​తీసుకోని కేటగిరీలో ఉన్నారు. ఒక్క హైదరాబాద్​ జిల్లాలోనే 12 వేల మంది ఫస్ట్​డోస్ తీసుకోలేదని తేలింది.  

ఇప్పటివరకు 9 వేల కిట్లు పంపిణీ
ఫీవర్ సర్వేలో భాగంగా ఇప్పటివరకు 9 వేల మందిలో  సింటమ్స్​గుర్తించి హోమ్ ఐసోలేషన్ మెడిసిన్​కిట్లను పంపిణీ చేశారు.  హైదరాబాద్​లోనే లక్షా15, 111 ఇండ్లలో సర్వే చేయగా, పూర్తయ్యే వరకు కొనసాగనుంది.  గ్రేటర్​లోని జనాభా పూర్తయ్యే వరకు సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు చెప్తున్నారు. హెల్త్​స్టాఫ్  కూడా కొవిడ్​బారిన పడుతుండగా కొన్నిచోట్ల సర్వే లేటవుతుంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సర్వే స్లోగా ఉంది. ఉన్నతాధికారులు కూడా సరిగా ఫోకస్ చేయడంలేదు. మేడ్చల్​జిల్లాకి సంబంధించిన వివరాలు కూడా చెప్పేందుకు జిల్లా వైద్యాధికారి ఇంట్రెస్ట్​చూపడం లేదంటే సర్వే ఎలా చేస్తున్నారో తెలుస్తోంది. 

దవాఖానలకు పోని వారే ..
కొవిడ్​ స్వల్ప లక్షణాలు ఉన్నవారిలో చాలా మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ మెడిసిన్​వేసుకుంటున్నారు. ఇంకొందరిలో లక్షణాలు ఉన్న కూడా  హాస్పిటల్స్​కి వెళ్లకుండా ఇంట్లోనే సొంతంగా మెడిసిన్​వాడుతున్నారు.  మరికొందరు ఎలాంటి మందులు వాడడం లేదని సర్వేలో తెలుస్తోంది. ప్రస్తుతం ఫీవర్ సర్వేలో గుర్తించిన వారిలో ఇలాంటి వారే ఎక్కువగా ఉన్నారు. జ్వరం దానంతట అదే తగ్గిపోతుందన్న నిర్లక్ష్యంతో మెడిసిన్​వాడడంలేదని వెల్లడైతుంది. ఫీవర్ సర్వేలో ఇంటింటికి వెళ్లి మెడిసిన్​కిట్​ఇస్తే తీసుకుంటుండగా, లక్షణాలు ఉన్నవారు మస్ట్​గా మెడిసిన్​వాడాలని లేదంటే,  ఇంట్లోని మిగతా కుటుంబసభ్యులకు సోకే అవకాశం ఉంటుందని మెడికల్​ఆఫీసర్లు సూచిస్తున్నారు.

హైదరాబాద్​ జిల్లాలో 3 రోజుల్లో గుర్తింపు ఇలా...    సంఖ్య
18 ఏండ్లు పైడి ఫస్ట్ డోస్ తీసుకోని వారు    7,382
15 ఏండ్లు పైడి ఫస్ట్ డోస్ కూడా వేయించుకోని వారు    4,615
సెకండ్​ డోస్ తీసుకోని వారు    12,180
బూస్టర్ డోస్ తీసుకోని వారు    1,432