తెలంగాణలో మూడురోజుల్లోనే.. 1.78 లక్షల మందికి కరోనా కిట్లు

తెలంగాణలో మూడురోజుల్లోనే.. 1.78 లక్షల మందికి కరోనా కిట్లు
  • ఫీవర్​ సర్వేలో గుర్తింపు
  • మూడురోజుల్లోనే 1.78 లక్షల మందికి కిట్లు
  • టీకా తీసుకోని వాళ్లకే ఎక్కువ లక్షణాలు
  • కిట్​లోని మందులన్నీ వాడాలంటున్న డాక్టర్లు
  • కొత్తగా 3,603 కేసులు.. ఒకరు మృతి
  • చాలా మెట్రో సిటీల్లో దాని కేసులే ఎక్కువని వెల్లడి
  • యాంటీ జెన్​ టెస్టులతో కరోనా ఫాల్స్​ నెగెటివ్​లు
  • ఆర్టీపీసీఆర్​ టెస్టులే చేయాలి
  • మరో కొత్త వేరియంట్​ ‘బి.1.640.2’ కేసులు లేవని వెల్లడి
  • దేశంలో డైలీ కేసులు 3 లక్షలపైనే..


రాష్ట్రంలో లక్షల మందికి కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్​ సర్వే ప్రారంభం కాగా,  మూడు రోజుల్లో ఒక లక్షా 78 వేల మందికి జ్వరం, సర్ది, దగ్గు, ఒంటినొప్పులు వంటి కరోనా లక్షణాలు ఉన్నట్లు హెల్త్​స్టాఫ్​ గుర్తించారు. వారందరికీ  మెడికల్​ కిట్లు అందజేసి, హోం ఐసోలేషన్​లో ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు 83 లక్షల ఇండ్లు ఉండగా.. ఆదివారం వరకు ఫీవర్​ సర్వే 42.3 లక్షల ఇండ్లలో జరిగింది. ఇప్పటివరకు కరోనా టీకా ఒక్క డోస్​ కూడా తీసుకోని వాళ్లకే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు అంటున్నారు. కరోనా ఉన్నా, లేకున్నా కిట్​లోని మందులన్నీ వాడాలని, వాటితో ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ ఉండవని చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్తగా 3,603 మందికి పాజిటివ్ వచ్చిందని, వీటితో కలిపి  32,094 యాక్టివ్​ కేసులు ఉన్నాయని ఆదివారం హెల్త్​ డిపార్ట్ మెంట్​ ప్రకటించింది.

 రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచే ఇంటింటి ఫీవర్​ సర్వే ప్రారంభమైంది. ఆశా వర్కర్లు, ఏఎన్​ఎంలు, పంచాయతీ, మున్సిపల్​ సిబ్బంది కలిసి సర్వే చేస్తున్నారు. జ్వరంతోపాటు, దగ్గు, సర్ది, ఒంటినొప్పులు లాంటి కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను గుర్తించి హోం ఐసోలేషన్​ కిట్లు పంపిణీ చేస్తున్నారు. తొలి రోజు 56,466 మందికి, రెండో రోజు 70,906 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించి మెడికల్​ కిట్లు పంపిణీ చేశారు. ఆదివారం 13 లక్షల ఇండ్లను విజిట్ చేసి 50,807 మందికి కిట్లు అందజేశారు. మొత్తంగా మూడు రోజుల్లోనే 1.78 లక్షల కిట్లను పంపిణీ చేశారు. వీళ్లంతా కరోనా లక్షణాలు ఉన్నవాళ్లే కావడంతో ఐదు రోజులు హోం ఐసోలేషన్​లో ఉండాలని హెల్త్​ స్టాఫ్​ సూచించారు. అప్పటికీ లక్షణాలు తగ్గకుంటే సంప్రదించాలని చెప్పి వస్తున్నారు. టెస్టులు లేకుండా లక్షణాలు ఉన్నాయని ఐసోలేషన్​ కిట్లు ఇస్తుండడంతో చాలామంది టెన్షన్​ పడుతున్నారు. తమకు కరోనా​ ఉందో, లేదో తెలుసుకునేందుకు కొందరు టెస్టులకు వెళ్తుండగా, ఇంకొందరు 5 రోజులే కదా అని ఇండ్లకే పరిమితమవుతున్నారు.  

కిట్​లో ఏడు రకాల గోలీలు.. 
హోం ఐసోలేషన్ కిట్​లో ఐదు రోజులకు సరిపడా ఏడు రకాల గోలీలు ఇస్తున్నారు. పారాసిటమాల్ 10, అజిత్రోమైసిన్ 5, రాంటాక్ 10, లివో సెట్రిజన్ 1‌‌0, మల్టీ విటమిన్ 10, జింక్ 10, విటమిన్- డి  10 ఉంటున్నాయి. కాగా, చాలా మంది తమకు కరోనా ఉందో లేదో తెలియనప్పుడు ఈ టాబ్లెట్స్​ వాడితే సైడ్​ఎఫెక్ట్స్​వస్తాయని భయపడుతున్నారు. కానీ ప్రభుత్వం అందించే ఐసోలేషన్​ కిట్లలోని గోలీలన్నింటినీ వాడాలని, వాటితో సైడ్​ ఎఫెక్ట్స్​ ఉండవని డాక్టర్లు చెప్తున్నారు. ఒమిక్రాన్‌​తో  లంగ్స్​ ఎఫెక్ట్ అయ్యే చాన్స్​ తక్కువని,  ఒకవేళ ఎఫెక్ట్ అయితే అదనంగా మందులు వాడాల్సి ఉంటుందని అంటున్నారు.

రాష్ట్రంలో 32,094 యాక్టివ్​ కేసులు
రాష్ట్రంలో మరో 3,603 మంది కరోనా బారినపడ్డారని హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఆదివారం 93,397 మందికి టెస్టులు చేస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 1,421 మందికి, జిల్లాల్లో 2,182 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. మొత్తం కేసుల సంఖ్య 7,34,815కి చేరింది. ఇందులో 6,98,649 మంది కోలుకోగా, మరో 32,094 యాక్టివ్ కేసులు ఉన్నాయని తాజా హెల్త్​ బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనాతో ఆదివారం మరొకరు మరణించగా, మృతుల సంఖ్య 4,072కి పెరిగినట్టు బులెటిన్​లో పేర్కొన్నారు. 

స్టాఫ్​ వెళ్లే సరికే మెడిసిన్​ తీసుకుంటున్నరు
గ్రేటర్ హైదరాబాలో మూడు రోజులుగా లక్షా 70 వేల ఇండ్లలో ఫీవర్ సర్వే చేయగా 9 వేల మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వీరందరికీ కిట్లు ఇచ్చారు. డోర్​ టు డోర్​ సర్వేలో కొన్ని అంశాలు బయటపడ్డాయని, వందలాది మంది ఫస్ట్​ డోస్​ కూడా తీసుకోనివాళ్లు ఉన్నారని అంటున్నారు. వేల మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని, తాము వెళ్లే సరికే డాక్టర్ల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ మందులు వాడుతున్నారని చెప్తున్నారు. కొందరు హాస్పిటళ్లకు వెళ్లక ఇంట్లోనే మెడిసిన్​ తీసుకుంటున్నారని గుర్తించారు. కరోనా లక్షణాలుండీ ఎలాంటి మెడిసిన్​వాడనివాళ్లు ఫీవర్ సర్వేలో బయటపడు తున్నారని హెల్త్​స్టాఫ్​ చెప్తున్నారు.