సార్ సలహాదారుకు తక్కువ... స్ట్రాటజిస్టుకు ఎక్కువ..

సార్ సలహాదారుకు తక్కువ... స్ట్రాటజిస్టుకు ఎక్కువ..

రాష్ట్ర సర్కార్ సలహాదారులుగా పెట్టుకున్నోళ్లు.. ప్రజలకు పనికొచ్చేవి ఏమున్నాయి ? ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? పాలసీ నిర్ణయాలు ఎలా ఉండాలనే దానిపై సలహాలు.. సూచనలు చేయాలి. కానీ రాష్ట్రంలో అడ్వయిజర్ల పరిస్థితి అందుకు భిన్నంగా సాగుతోంది. ఏకంగా ఎలక్షన్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ఇటీవల కాలంలో చీఫ్ అడ్వయిజర్​గా నియమితులైన ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్​ పూర్తిగా అసెంబ్లీ ఎలక్షన్స్, మహారాష్ట్ర పొలిటికల్ వ్యవహారాలు చూసుకుంటున్నట్లు చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి సంబంధించిన అసలు విషయాలు వదిలేసి.. మహారాష్ట్రలో ఏం జరుగుతున్నది? ఎప్పుడు? ఎక్కడ? ఎలా మీటింగ్​లు పెట్టాలి? ఎవరిని జాయిన్ చేసుకోవాలి? అక్కడి సర్వే రిపోర్టులు.. వెళ్లే లీడర్లు ఏం మాట్లాడాలి అనే విషయాలపై మొత్తం సదరు అడ్వయిజర్ చెప్పినట్లు చేస్తున్నట్లు తెలిసింది.3

 ఆయన కూడా తనను కలిసిన ప్రతివారి దగ్గర నుంచి ఫీడ్​బ్యాక్​ తీసుకుంటున్నట్లు ఆఫీసర్లు గుసగుసలాడుతున్నారు. తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి? సర్వేల్లో ఏం ఉందో కూడా తెగేసి చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ అని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఈ సలహాదారుతో పాటు మరో ఇద్దరు అడ్వయిజర్లు కూడా రాజకీయం అంశాలపైనే డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు. వివిధ రకాలుగా సేవలు వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది మందిని సలహాదారులుగా పెట్టుకున్నది. ఇందులో ఒక మాజీ సీఎస్ పూర్తిగా రాష్ట్రంలో ఎన్నికల తంతు, మహారాష్ట్ర పాలిటిక్స్ కు పరిమితమయ్యారు. ఏ స్కీం ఎంత మేర లబ్ధి చేకూరుస్తుంది? ఎన్ని ఓట్లు రాబడుతుందనేది కూడా చెబుతున్నారు. దీంతో ఆయనో స్త్రాటజిస్ట్ అని సెక్రటేరియేట్​లో అధికారులు చెవులు కొరుక్కుంటున్నారు. 

గతంలో సీఎస్​గా పనిచేసి.. కొత్తగా చీఫ్ అడ్వయిజర్ పోస్ట్​ తీసుకోవడంతో అంతకుముందు ఆయన గతంలో చూసిన సబ్జెక్ట్​లన్నీ చూస్తారని అంతా భావించారు. ఆ విషయాల్లో ప్రభుత్వానికి సూచనలు చేస్తారని కూడా అనుకున్నారు. పైగా కొందరు ఐఏఎస్​లు కూడా మళ్లీ తమ పనుల్లో ఎక్కడ వేలు పెడుతారో అనే ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే ఇవేమి కాకుండా.. ఆయన ధ్యాసంతా ఎలక్షన్లపైనే పెట్టడం అందులోనూ మహారాష్ట్ర వ్యవహారాలపై మరింత ఫోకస్ పెట్టి మరీ అడ్వయిజరీ పోస్టును పొలిటికల్​గా చాలా సక్సెస్​ఫుల్​గా చేస్తున్నారని అధికారులు చర్చించుకుంటున్నారు. పైగా ఆయనకు ఎక్కడా పోటీ చేసే ఆసక్తి లేదు. కాకపోతే రాజ్యసభ మెంబర్​ కావాలని చిరకాల కాంక్ష ఉన్నట్లు తన సన్నిహితుల దగ్గర చెపుకున్నట్లు తెలిసింది.